పార్వతీపురం జిల్లాలో వచ్చేనెల 3న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో బి.జగన్నాథ రావు కోరారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పల్స్‌పోలియో రూట్ సూపర్‌వైజర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల పరిధిలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. గ్రామాల్లో దండోరా వేయించడంతో పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేం ద్రాలు, గ్రామ పంచాయతీ, సచివాలయం తదితర ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలని సూచించారు. వ్యాక్సిన్ కేరియర్, కోల్డ్‌బాక్స్‌లు, ఐస్‌ప్యాక్‌లు, రిఫ్రిజిరేటర్లు సిద్ధంగా ఉన్నవి, లేనివి చూసుకోవాలని తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ విధిగా చుక్కలు వేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఎం.రామారావు, ఆర్‌బీఎస్‌కే పీవో దవళ భాస్కరావు తదితరులు పాల్గొన్నారు.