సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి గౌరుచరిత అన్నారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టాలని ప్రజలు, టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, పన్నులు, చార్జీల పెంపు, నిత్యావసర సరుకుల ధరలు, ఇసుక, భూ అక్రమాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాల న్నారు. కార్యక్రమంలో 19వ వార్డు ఇన్‌చార్జి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యా దవ్, కల్లూరు అర్బన్ వార్డు కన్వీనర్ పెరుగు పురు షోత్తంరెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, వంగాల జనార్ధన్‌రెడ్డి, బన్నూరు అశోక్‌కుమార్, పల్లె రఘునాథ్‌రెడ్డి, కిట్టు, వీరేంద్ర, సు బ్బు, జగదీష్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, కరిష్, జగదీష్ పాల్గొన్నారు.