నెల్లూరులో మార్చి నెల 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉండనుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వీపీఆర్ కన్వెన్షన్‌లో ఏర్పాట్లని టీడీపీ నేతలు పరిశీలించారు. మార్చి 2వ తేదీన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారన్నారు. వీపీఆర్ కన్వెన్షన్‌లో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు భారీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. చంద్రబాబు సమక్షంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది , ఆయన సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ ప్రశాంతి రెడ్ది టీడీపీలో చేరనున్నారని వెల్లడించారు. వీపీఆర్ దంపతులతో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు భారీగా టీడీపీలో చేరుతున్నారు.