చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డా.పీవీ కృష్ణాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాకు 14 బహుళ జాతి కంపెనీలు హాజరవుతాయన్నారు. 18 నుం చి 30ఏళ్ల వయసు ఉన్న ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐటీఐ పూర్తిచేసినవారు ఈ మేళాకు హాజరుకావచ్చునన్నారు. తమ వివరాలను ఠీఠీఠీ.్చఞటటఛీఛి.జీుఽ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్ నమో దు రిఫరెన్సుతో పాటు ఇతర విద్యార్హత ధ్రువపత్రాలు, ఒరిజినల్, జిరాక్సుల తో సహా 29న ఉదయం 9 గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావా లని ప్రిన్సిపాల్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ మేళా నిర్వహిస్తున్నాయని చెప్పా రు. ఇతర వివరాల కోసం 9010023033, 728042743 నెంబర్లకు గానీ, టోల్‌ఫ్రీ నెంబరు 9988853335కు ఫోన్ చేయాలని ప్రిన్సిపాల్ కృష్ణాజీ సూచించారు.