కనిగిరి నియోజకవర్గ పరిధిలోని సీఎ్‌సపురం మండలంలోని అంబవరం కొత్తపల్లికి చెందిన సచివాలయ గ్రామ సర్వేయర్ ఒంగోలులో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం జరిగింది. సీఎ్‌సపురం ఎస్‌ఐ చెప్పిన వివరాల ప్రకారం... జిల్లాలోని చీమకుర్తి మండలం దేవరంపాడు గ్రామానికి చెందిన గోపిరెడ్డి(26) సీఎ్‌సపురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామ సర్వేయర్‌గా విఽధులు నిర్వహిస్తున్నాడు. ఓ బాలికా అదృశ్యంపై అనుమానంతో గోపిరెడ్డిని సోమవారం విచారణకు పిలిచారు. విచారణలో ‘‘ఆ బాలిక తన వద్ద శనివారం వరకూ ఉందని, ఆ తర్వాత ఒంగోలులో వదిలి పెట్టానని.. ఇక్కడెలా ఉంటావని ప్రశ్నిస్తే అనాథ ఆశ్రమంలో ఉంటానని చెప్పిందని’’ గోపిరెడ్డి తెలిపాడు. ఆ బాలికను వెతికేందుకు గోపిరెడ్డి వెంట కొంతమంది సిబ్బందిని ఒంగోలు పంపించారు. ఆశ్రమంలో బాలిక లేకపోవటంతో చుట్టుపక్కల ఒంగోలులో వెతకటం ప్రారంభించారు. ఈ క్రమంలో ట్రెండ్స్ వద్ద టీ తాగుతూ ఉండగా, గోపిరెడ్డి టాయిలెట్‌కి అని కనిపించకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత మంగళవారం 12గంటల సమయంలో రైలు కింద పడి యువకుడు మృతి చెందినట్లుగా సమాచారం రావటంతో అతని వద్ద ఉన్న ఐడెంటీ కార్డు ఆధారంగా గోపిరెడ్డిగా తేలింది. బాలిక వివరాలు మాత్రం తెలియలేదు. బాలిక తల్లితండ్రులు మౌఖిక ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.