మన ప్రభుత్వంలో చేసిన మంచి పనులు..టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు చెప్పాలని వైయస్ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నుంచి 2,500 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేడర్‌ను ఉద్దేశించి ‘రాబోయే 45 రోజులు కీలకం’ అంటూ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహంపై సీఎం వైయస్ జగన్ పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. దాదాపు అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశామని ప్రకటించారు. బూత్‌స్థాయిలో పార్టీని వీలైంత తొందరగా యాక్టివేట్ చేయాలని సూచించారు. విపక్షాలు చేసే విషప్రచారం తిప్పి కొట్టాలని సీఎం వైయస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.