అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ అర్బన్ కార్యాలయంలో బుధవారం చంద్రన్న టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తనయుడు మధుకర్ చౌదరి, టి. ఎన్. టి. యు. సి పోతుల లక్ష్మి నరసింహులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ టైలర్ లు స్వశక్తితో వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని అలాంటి వారికి ప్రభుత్వాలు చేయూతను అందించాలన్నారు.