ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తే రాజమండ్రి నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ భరత్ తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని 24వ వార్డులో ఆయన ఇంటింటికీ వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నదీ లేనిదీ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వార్డులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారితో ఆయన ముచ్చటించారు.