మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు. రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్. 2022లో విడుదలయ్యాడు. శ్రీలంకకు చెందిన ఇతడు ఎల్ టి టి ఈలో పని చేసేవాడు.