ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ ‘టాటా ఇన్‌స్టిట్యూట్’ కీలకమైన ప్రకటన చేసింది. క్యాన్సర్ రెండవసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది.
ఈ టాబ్లెట్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఇది జూన్-జులై నుంచి మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. టాబ్లెట్ విలువ కేవలం రూ.100 అని తెలిపారు.