ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. పలు రైళ్ల సమయాలను మార్చినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. బ్రహ్మపుర-నౌపడ మార్గంలో లిమిటెడ్ హైట్ సబ్‌వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. అందుకే ఈనెల 29న ట్రాఫిక్ బ్లాక్ చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగనున్నందున పలు రైళ్లు బయల్దేరే సమయాల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఆ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈనెల 29న భువనేశ్వర్-చెన్నై సెంట్రల్(12830) ఎక్స్‌ప్రెస్ 5.25 గంటలు ఆలస్యంగా బయలు దేరనున్నట్లు తెలిపారు. దీంతో పాటు భువనేశ్వర్-సి.ఎస్.టి. ముంబై (11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సికింద్రాబాద్(12703), విశాఖ-డిఘా(22874), విశాఖ-బ్రహ్మపుర(18526) రైళ్లు గంటకు పైగా ఆలస్యంగా బయలు దేరనున్నట్లు తెలిపారు. కామాఖ్య-బెంగళూరు(12552), సి.ఎస్.టి. ముంబై-భువనేశ్వర్(11019), విశాఖ-భువనేశ్వర్(22802) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు స్టేషన్‌లలో 20 నిమిషాలకు పైగా నిలిపేయనున్నామన్నారు. ప్రయాణికులు ఈ మార్పుల్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు సూచించారు.
మరోవైపు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 28 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేశారు. విజయవాడ- గుంటూరు(07783), గుంటూరు- విజయవాడ(07788), గుంటూరు- మాచర్ల(07779), గుంటూరు- విజయవాడ(07465), గుంటూరు- రేపల్లె(07786) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. అదేవిధంగా నర్సాపూర్- గుంటూరు-నర్సాపూర్(17282/17281) రైళ్లును విజయవాడ గుంటూరు మధ్య ఈనెల 28 నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశామన్నారు.