ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల ధరల్లో భారీ తేడా ఉండటంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వైద్యసేవల ధరల్లో ప్రామాణికత పాటించాలని, లేదంటే సీజీహెచ్‌ఎస్ రేట్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది.
ప్రజాజీవితంలో పారదర్శకత కోసం వెటరన్స్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.