హిందూపురం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ప్రజా పోరుయాత్ర చేపట్టారు. స్థానిక చిన్న మార్కెట్, వాల్మీకి, బాలయేసు స్కూలు, భగీరథ కూడలిలో జరిగిన ఈ యాత్రలో కోకన్వీనర్ చలపతి, భాజపా తిరుపతి జిల్లా ఇన్ ఛార్జి పార్థసారథి, హిందూపురం అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు వరప్రసాద్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు.