మార్చి 1వ తేదీ (శుక్రవారం)న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 2వ తేదీ.. భృంగీ వాహన సేవ, ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు. 3న హంస వాహన సేవ జరగనుండగా... విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 4వ తేదీ.. మయూర వాహన సేవకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 5వ తేదీ.. రావణ వాహన సేవకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది. 6న పుష్పపల్లకీ సేవ, 7న గజవాహన సేవ నిర్వహించనున్నారు. 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రభోత్సవం, నంది వాహన సేవ. లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. 10న ధ్వజావరోహణం.. 11న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.