ఏపీలో చిరుత పులుల సంఖ్య పెరిగినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన
‘ఐదో చిరుత పులుల జనాభా నివేదిక’ను ఆయన తాజాగా వెల్లడించారు. దీని ప్రకారం ఏపీలో 2018 నాటికి 492 చిరుతలు ఉండగా.. 2022 నాటికి 569 పెరిగాయి. దేశవ్యాప్తంగా 13,874 చిరుత పులులు ఉన్నాయి.