ఈ నెల 6న రాష్ట్ర మంత్రి మండలి భేటీ కానుంది. సాధారణ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఇది మంత్రి మండలి చివరి భేటీగా భావిస్తున్నారు.
ప్రధానంగా మార్చి నెలలో వివిధ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపేందుకు ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఒక వేళ 6వ తేదీన వీలు కాకపోతే 7న సమావేశం నిర్వహించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.