కర్నూలు జిల్లా, ప్యాపిలి మండలంలోని రామరత్నగిరి గ్రామంలో గత ఏడాది జరిగిన చోరీ కేసులో నిందితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని జలదుర్గం పోలీసు స్టేషన్‌లో నిందితు డిని విలేకర్ల సమావేశంలో హాజరు పరిచిన సీఐ సుధాకర్‌రెడ్డి వివరా లను వెల్లడించారు. మండలంలోని రామరత్నగిరిలో గత ఏడాది నవం బరు 23న సున్నపు రాముడు ఇంట్లో 6 తులాల బంగారం అపహర ణకు గురైంది. ఈ చోరీ బనగానపల్లి మండలం యనగండ్ల గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం చేశాడని గుర్తించామని తెలిపారు. నిందితుడిని మండలంలోని రామక్రిష్ణాపురం గ్రామం వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జలదుర్గం ఎస్‌ఐ విజ య్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.