గుంటూరు జిల్లా, ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను కారు ఢీ కొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పత్తిపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు మంగళగిరి వాసులుగా గుర్తించారు. పిడుగురాళ్ల మండలం, జూలకల్లులో పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.