కాశినాయన మండలం వడ్డమాను గ్రామంలో నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రం లను ఎమ్మెల్సీ డి సి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం లో యువ నాయకులు ఆదిత్య రెడ్డి, గురివిరెడ్డి, జేఏసీ హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు.