నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్తగా తనను నియమించడం పట్ల వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ఒకవైపు..వైయస్ఆర్సీపీ మరో వైపు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలను యుద్ధంలా భావించి పని చేయాలని పార్టీ శ్రేణులకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. 175 సీట్లు అనేది ఒక నినాదంలా తీసుకెళ్లాలని సూచించారు.