టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీల అభిప్రాయాలు..ఆలోచనలు తెలుసుకోవడం జరిగిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా.. సామాజికంగా.. ఆర్థికంగా.. విద్యాపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. బీసీల అభిప్రాయాలు.. చంద్రబాబు ఆలోచనల కలగలుపు టీడీపీ ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ అని చెప్పుకొచ్చారు.