రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకొంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన కాళిదాసు (35) బొకారో ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తున్నాడు.
శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రైలు దువ్వాడ స్టేషన్కు వచ్చేసరికి రైలు నుంచి కాళిదాసు జారి పడిపోయాడు. దీంతో పలువురు ప్రయాణికులు చైన్ లాగి రైలు ఆపారు.