టీడీపీ, జనసేనతో పొత్తులపై ఏపీ బీజేపీ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల జరిగిన సమావేశాల్లో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పొత్తులపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశామని, 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టామని ఆమె పేర్కొన్నారు. అభ్యర్థుల సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తామన్నారు.