బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల పరిధిలో గుర్తించిన చిన్నారుల్లో 97% మంది పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర తెలిపారు. జిల్లాలో 1, 45, 318 మంది చిన్నారులకు పోలియో నివారణ చుక్కల మందు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, వారిలో తొలిరోజు 1, 41, 927 మందికి అందించామన్నారు. మిగిలినవారికి సోమ, మంగళవారాల్లో అందిస్తారన్నారు.