పోస్టల్ శాఖ ‘సామూహిక ప్రమాద బీమా’ పాలసీ అమలు చేస్తోంది. వార్షిక ప్రీమియం రూ.399 చెల్లిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తోంది. 18-65 ఏళ్ల వయసున్న వారు అర్హులు.
ప్రమాదంలో చనిపోయినా, శాశ్వత వైకల్యం కలిగినా, ఏదైనా అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. ఒకవేళ ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరితే ఇన్ పేషెంట్ డిపార్టుమెంట్ కింద రూ. 60 వేలు, ఔట్ పేషెంట్ కింద రూ.30వేలు ఇస్తారు.