అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో తాలూకా అధ్యక్షులు జయరాజు, పాత్రికేయులు సోమవారం మంత్రాలయం మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. మార్చి 12 లేదా 13 తేదీలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.