అనంతపురం కార్పొరేషన్ యస్ఈ. రామ్మోహన్ రెడ్డి వారం రోజుల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. సోమవారం ఉదయం యస్ఈ. ఈ ఈ సూర్యనారాయణతో కలిసి 50వ డివిజన్, ఆర్ కే నగర్ వాటర్ ట్యాంక్ పరిదిలో త్రాగునీటి సరఫరా సమస్యపై 2వ రోడ్డులో స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. నీటి సరఫరా సిస్టం ను ఫీల్డ్ లోనూ, మ్యాప్ లో పరిశీలించారు. వీరితోపాటు కార్పొరేటర్ గురు శేఖర్ బాబు, ఫిట్టర్ లు, వాల్ ఆపరేటర్ లు పాల్గొన్నారు.