విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం విద్యార్థులను దగా చేస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్ విమర్శించారు. విద్యా, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుంతకల్లు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పరమేష్ మాట్లాడుతూ ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం 7 కోట్లు బకాయిలు చెల్లించాలన్నారు.