ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. మహిళా సాధికారతలో ఏపీ టాప్ లో నిలిచిందని 'ద ఇండియన్ ఇండెక్స్ నివేదికలో వెల్లడైంది. ఈ విషయాన్ని వైసిపి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఏపీలో 13.65 లక్షల మంది మహిళలు లక్షాధికారులుగా మారి తొలి స్థానంలో ఏపీ నిలిచింది. రెండో స్థానంలో బీహార్, మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు నిలిచాయి.