గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం పాలెంలో రూ 20 లక్షలతో నిర్మించిన పార్కు, బ్యాడ్మింటన్ కోర్టును మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మురళీధర్, ఎంపీపీ సురేంద్ర నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.