ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ దాడి చేసింది. ఉక్రెయిన్ సైన్యం జరిపిన
ఈ దాడిలో నౌక మునిగిపోయిందని ఉక్రెయిన్ నేవీ ప్రతినిధి డిమిత్రో ప్లెటెన్‌చుక్ వెల్లడించారు. రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, డ్రోన్లతో దాడి చేసినట్టు మంగళవారం వివరించారు. ఈ క్రమంలో 65 మిలియన్ డాలర్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa