సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో టైగర్ సఫారీని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. వన్యప్రాణుల సంరక్షణ అవసరాన్ని జాతీయ వన్యప్రాణుల సంరక్షణ ప్రణాళిక గుర్తిస్తోందని స్పష్టం చేసింది. కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అక్రమ నిర్మాణం, చెట్ల నరికివేతపై రాష్ట్ర మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్, అప్పటి DFO కిషన్ చంద్‌లను కూడా సుప్రీం కోర్టు తప్పుపట్టింది.