బెంగళూరు నగరంలో తీవ్ర నీటి ఎద్దడిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి నెలకొందని, తన ఇంట్లోని బోరు కూడా ఎండిపోయిందని తెలిపారు.
ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నగర ప్రజలకు నీరు అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయకండి అంటూ ప్రజలకు సూచించారు.