ఏపీలో మూడు జిల్లాలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి అయోధ్యకు దక్షిణ మధ్య రైల్వే నూతన రైలును ప్రారంభించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అయోధ్య రామున్ని దర్శించుకోవాలని రైల్వే అధికారులు కోరారు . ఆస్తా స్పెషల్ పేరుతో దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి అయోధ్య దాం జంక్షన్ వరకు సరికొత్త ప్యాకేజీ తో నూతన రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రయిన్‌ను బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ రైలులో రూ.2,440 ప్యాకేజీ ధరతో రవాణా, వసతి, భోజన సదుపాయాలను రైల్వే శాఖ కల్పిస్తోంది. బుధవారం తిరుపతి నుంచి దాదాపు 500 మంది భక్తులు అయోధ్యకు ఈ రైలులో బయల్దేరారు. ప్రయాణికులకు బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు బిస్కెట్లు పండ్లు ఫలహారాలను అందజేశారు. తిరుపతి నుంచి ఈ రైలు బయల్దేరనుండటంతో ఆ పక్కనే ఉన్న నెల్లూరు, చిత్తూరు అన్నమయ్య జిల్లాల ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.