వైఎస్ఆర్ నాలుగో విడత నిధులను రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. అనకాపల్లి సభలో బటన్ నొక్కగానే మహిళల ఖాతాల్లో రూ.18,750 జమ అవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం చాలాసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ గ్రాంట్ కింద ఏడాదికి రూ.18,750 అందజేస్తున్నారు. మొత్తం 31 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు.