జమ్మూ కాశ్మీర్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీపై టీఎంసీ నాయకుడు, అసన్సోల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా గురువారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ శ్రీనగర్ పర్యటన వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చడమే అని అయన అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరి సంక్షేమం కోసం చాలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు, “మమత దేశానికి ఏకైక మహిళా ముఖ్యమంత్రి” అని అన్నారు. కేంద్రం నుండి కేటాయించిన ఆరోగ్య నిధుల గురించి అడిగినప్పుడు, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరి కంటే క్యాన్సర్ చికిత్స కోసం ఎక్కువ నిధులు పొందడం నా అదృష్టం అని, దాని వల్ల నేను ప్రజలకు సహాయం చేశానని అన్నారు.కాగా, ప్రధాని మోదీ శ్రీనగర్ పర్యటనను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ, ప్రధాని మోదీ పర్యటన మనందరికీ గర్వకారణమని, అయితే ఆర్టికల్ 370 ఇంత దారుణంగా ఉంటే, కేంద్ర పాలిత ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందని అన్నారు.