2024 ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాదని..మా టార్గెట్ 175 సీట్లు కొట్టి తీరుతాం. మేదరమెట్ల సిద్ధం వేదికగా వచ్చే ఐదేళ్లలో చేయబోయే కార్యక్రమాల్ని వివరిస్తాం. రాబోయే కాలంలో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం." అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.