జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అనేక మంది తమ పదవులకు రాజీనామా చేశారు.
తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యే వర్మ భావోద్వేగానికి గురై కంటతడి కూడా పెట్టారు. రాజులకు ఆస్థానంగా పేరుగాంచిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కన్ఫమ్గా పోటీ చేస్తారనే ప్రచారంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.