మహాశివరాత్రి పండుగను ఆచరించడంలో శివార్చన, ఉపవాసం, జాగరణం ప్రధానమైనవి. శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానమాచరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి.
ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తులో ఉంది. ఇక జాగారం అంటే శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు 4 జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం.