అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సేలా టన్నెల్‌ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అతిపొడవైన ఈ బైలేన్ టన్నెల్ 13 వేల అడుగుల ఎత్తులో రూ.825 కోట్ల వ్యయంతో నిర్మించారు.
చైనాతో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇది అందుబాటులోని రావటం చాలా కీలకమని విశ్లేషకులు అంటున్నారు. దీని ద్వారా మరింత వేగంగా సైనిక బలగాల రాకపోకలు సాగించవచ్చని పేర్కొన్నారు.