ఏపీలో ఎన్నికల పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. నేడు అమిత్ షాతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య అవగాహన కుదిరింది.
జనసేన, బీజేపీలకు 8 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. బీజేపీకి ఐదు లేదా ఆరు ఎంపీ సీట్లు ఇస్తే మిగతా రెండు లేదా మూడు ఎంపీ స్థానాలు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. అరకు,నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది