కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది. ఏపీలో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నేతలు చర్చించారు.
దాదాపు గంటకు పైగా చర్చలు కొనసాగాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.