సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పశ్చిమబెంగాల్లోని ఝార్గ్రామ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ కునార్ హెంబ్రామ్ రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను శనివారం ఉదయం పార్టీ జిల్లా అధ్యక్షుడికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశానని అందులో పేర్కొన్నారు. రాజకీయాల్లో కొనసాగడం ఇష్టం లేదని, రాజీనామాకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.