నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది.
కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు చోట్లా పవన్ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది. బీజేపీ పెద్దల సూచనతోనే కాకినాడ నుంచి ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.