టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కుదరడంతో బీజేపీ అభ్యర్థుల ఖరారుపై ఫోకస్ పెట్టింది. అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏలూరికి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఒకవేళ నర్సాపురం నుంచి అయితే ఎంపీ రఘురామ, హిందూపురం నుంచి సత్యకుమార్ లేకపోతే రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ పోటీలో ఉంటారనే సమాచారం.