2014లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారని వైయస్ఆర్‌సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నాడు. ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్‌లు పెట్టి, ప్రజలకు హామీలు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు సంతకం చేసిన పాంప్లెట్‌ను ఇంటింటికీ పంపారు. అందులో రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అని, మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని రకరకాల వాగ్దానాలు చేశారు. కానీ అందులో ఇచ్చిన హామీలు అమలయ్యాయా? అంటూ ముఖ్యమంత్రి తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు.