ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర, మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. విజయవాడ ప్రజల చిరకాల వాంఛ అయిన రిటైనింగ్ వాల్స్ నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. మంగళవారం విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించి కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు. రూ.369.89 కోట్లతో 80 వేల మంది ప్రజలకు ముంపు నుంచి విముక్తి కల్పించారు. రూ.12.4 కోట్లతో అద్భుతంగా రివర్ వ్యూ పార్క్ ను తీర్చిదిద్దారు. మోడ్రన్ ఎంట్రీ ప్లాజా , వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ , చిన్నారులకు ఆటస్థలం , గ్రీనరీతో సుందరంగా, ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగించనున్న రివర్ వ్యూ పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కేశినేని నాని,మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గం వైసిపి ఇంఛార్జి దేవినేని అవినాష్,ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,వెలంపల్లి శ్రీనివాస్,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్,రుహుల్లా, కల్పలతా రెడ్డి ,వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు,కార్పొరేటర్లు పాల్గొన్నారు.