కేరళలో ‘గవదబిళ్లల’ వ్యాధి బారినపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 190 కేసులు బయటపడడంతో వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి.
దీంతో ప్రజలు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేరళ ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరిక జారీ చేసింది. కాగా గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి.