ఒంటిపూట బడులు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభిస్తుంటే, ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా పెట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రకటించలేదు. విచిత్రంగా ఒంటిపూట బడులపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి పేరుతో ప్రకటన వెలువడింది. ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో ఆయన ఈ సమాచారాన్ని షేర్ చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఒంటిపూట బడులతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడికి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని, ప్రభుత్వ ప్రకటనలు ఆయన తెలియజేయడమేంటంటూ ఆక్షేపిస్తున్నారు. కాగా, 18 నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.