రాయలసీమలో సూర్యుడి ప్రతాపం తీవ్రతరమైంది. మార్చి రెండోవారంలోనే రోజూవారీ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
మంగళవారం అనంతపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాదా.. వరుసగా ఎనిమిదో రోజు ఇక్కడ దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఏప్రిల్ చివరి వారం, మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.